మణికొండ, ఏప్రిల్ 15: అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు జెమిని ఎడిబుల్స్ సంస్థ విరాళం అందజేసింది. మూడు ఎలక్ట్రిక్ వాహనాలను అందజేయడమేకాకుండా నార్సింగిలోని కేంద్రీకృత వంటశాలను ఆధునీకరిస్తామని తెలిపింది. సోమవారం ఈ వాహనాల ప్రారంభోత్సవంలో జెమిని ఎడిబుల్స్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరెడ్డి, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షుడు, ట్రస్టీ సత్యగౌర చంద్ర పాల్గొన్నారు. సత్యగౌర చంద్ర మాట్లాడుతూ నార్సింగిలోని వంటశాలను ఆధునీకరించడం తమ లక్ష్యసాధనలో భాగమని చెప్పారు.