World Kidney Day | ఈ నెల 14న ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏషియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) ఆధ్వర్యంలో ఆదివారం కిడ్నీ రన్ నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమట్రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD)పై అవగాహన పెంచేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యను ఎదుర్కోవడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇదో ముందడుగు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల మంది సీకేడీ బాధితులు ఉండగా.. అందరికీ ఆరోగ్యం-అందరికీ సమానంగా చికిత్స అవకాశాలు.. తగిన వైద్య చికిత్సలు’ థీమ్‌తో కిడ్నీ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వరుణ్ మాట్లాడుతూ పరుగులో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఏఐఎన్‌యూ కిడ్నీ రన్‌కు లభించిన ఈ అపార ఆదరణ చూస్తుంటే మన సమాజంలో కిడ్నీల ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. గుర్తింపు ఎంతగా పెరుగుతోందో అర్థమవుతుందన్నారు. సమష్టి కార్యక్రమానికి అందరూ కలిసిరావడం ద్వారా అవగాహన పెంచడమే కాక సీకేడీ బాధితులకు మంచి ఫలితాలు రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు అన్నారు. కార్యక్రమంలో వైద్యులు మల్లికారున, పీసీరెడ్డి, దీపక్ రాగూరి, క్రాంతి, వరుణ్, తైఫ్, లీలాకృష్ణ, కిడ్నీ రోగులు పాల్గొన్నారు.