హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ) : నాన్-ఇన్వేసివ్ బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో ఏఐజీ దవాఖాన విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఈ చికిత్స కోసం దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా జాప్-ఎక్స్ గైరోసోపిక్ రేడియో సర్జరీ విధానాన్ని ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించింది.
మెదడులో కణుతులు, ఇతర కపాలం లోపలి సమస్యలకు ఈ విధానంతో కచ్చితమైన, సురక్షితమైన చికిత్స అందించవచ్చని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జాప్-ఎక్స్ గైరోస్కోపిక్ పరికరాన్ని ఈ సంవత్సరం చివరి నాటికి గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.