హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘పిల్బా ట్ రోబో’ టెక్నాలజీ జీర్ణవ్యవస్థ వ్యా ధుల నిర్ధారణలో విప్లవాత్మక మార్పు లు తీసుకురానున్నదని ఏఐజీ దవాఖాన చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు.
అమెరికాకు చెందిన ‘ఎండియాట్’ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక రిమోట్ కంట్రోల్డ్ రోబోటిక్ క్యాప్సూల్ ‘పిల్బాట్’ను గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో మాయో క్లినిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వివేక్ కుంభారి, ఎండియాట్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అలెక్స్ ల్యూబేతో కలిసి ప్రదర్శించి దాని గురించి వివరించారు. రోబోటిక్ క్యాప్సూల్ ఎండోస్కోపీ టెక్నాలజీతో రోగనిర్ధారణ ఖర్చును తగ్గించడమే కాకుండా రోగి సంరక్షణను మెరుగుపర్చవచ్చని తెలిపారు.