హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దేశ యువతను, విద్యార్థులను మోసం చేసిన బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిద్దామని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులకు ఎన్నికల్లో ఓటు అడిగే నైతికహకు లేదని అన్నారు. హిమాయత్‌నగర్‌లోని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ‘బీజేపీ హఠావో-దేశ్ బచావో’ వాల్‌పోస్టర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేండ్ల మోదీ పాలనలో దేశంలో ఎలాంటి మార్పులు రాలేదని, కేవలం మతోన్మాదం, కార్పొరేట్ శక్తుల అంశాలపైనే దృష్టి సారించారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ కునుకుంట్ల శంకర్, బిజ్జ శ్రీనివాసులు, టీ సత్యప్రసాద్, పేరబోయిన మహేందర్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.