హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని డీసీసీలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ శనివారం రాత్రి ఏఐసీసీ ప్రకటించింది. 33 జిల్లాలు ఉండగా 36 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది. హైదరాబాద్ పరిధిలో మూడు జిల్లాలకు డీసీసీలను నియమించింది.
నరేశ్ జాదవ్(ఆదిలాబాద్), ఆత్రం సుగుణ(ఆసిఫాబాద్), తోట దేవీప్రసన్న(భద్రాద్రికొత్తగూడెం), బీర్ల అయిలయ్య(భువనగిరి), రాజీవ్‌రెడ్డి(గద్వాల), వెంకటరాంరెడ్డి(హనుమకొండ), ఖలీఫ్ సైదుల్లా(హైదరాబాద్), నందయ్య(జగిత్యాల), ధన్వంతి(జనగాం), కరుణాకర్(భుపాలపల్లి), మల్లికార్జున్(కామారెడ్డి), మేడిపల్లి సత్యం(కరీంనగర్), అంజన్‌కుమార్(కరీంనగర్ కార్పొరేషన్), రోహిత్ ముదిరాజ్(ఖైరతాబాద్), సత్యనారాయణ(ఖమ్మం), దీపక్ చౌదరి(ఖమ్మం కార్పొరేషన్), భూక్య ఉమ(మహబూబాబాద్), సంజీవ్ ముదిరాజ్(మహబూబ్‌నగర్), రఘునాథరెడ్డి(మంచిర్యాల), ఆంజనేయులుగౌడ్(మెదక్), తోటకూర వజ్రేష్‌యాదవ్(మేడ్చల్ మల్కాజిగిరి), పైడాకుల అశోక్(ములుగు), సీహెచ్ వంశీకృష్ణ(నాగర్‌కర్నూల్), పున్నా కైలాష్‌నేత(నల్లగొండ), కొల్లుదూరు ప్రశాంత్‌రెడ్డి(నారాయణ్‌పేట్), వెడ్మ బొజ్జు(నిర్మల్), నగేశ్‌రెడ్డి(నిజామాబాద్), బొబ్బిలి రామకృష్ణ(నిజామాబాద్ కార్పొరేషన్), రాజ్‌ఠాకూర్(పెద్దపల్లి), సంగీతం శ్రీనివాస్(రాజన్నసిరిసిల్ల), దీపక్‌జాన్(సికింద్రాబాద్), ఆంక్షారెడ్డి(సిద్దిపేట), గుడిపాటి నర్సయ్య(సూర్యాపేట), ధారసింగ్ జాదవ్(వికారాబాద్), శివసేనారెడ్డి(వనపర్తి), అయూబ్(వరంగల్)ఉన్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి నియామకాన్ని పెండింగ్ పెట్టింది. తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో వాయిదా వేసినట్టు తెలిసింది. ఆర్సీపురానికి చెందిన దేవ భాస్కర్‌రెడ్డి, బడంగ్‌పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత, చేవెళ్లకు చెందిన భీంభరత్, ఎల్బీనగర్కు చెందిన రాంమోహన్‌గౌడ్, షాద్‌నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి డీసీసీ పదవిని ఆశిస్తున్నట్టు తెలిసింది.