హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ఫైర్ డ్రాయింగ్ స్రూటినీ సిస్టమ్, ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సోమవారం హైదరాబాద్లోని అగ్నిమాపక శాఖ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఈ వ్యవస్థతో భవన ఫైర్, లైఫ్ సేఫ్టీ డ్రాయింగ్లను ఆటోమోటెడ్గా పరిశీలించడం ద్వారా అగ్నిప్రమాదాల నిరోధానికి కీలకంగా మారనున్నదని డీజీ నాగిరెడ్డి తెలిపారు.
కొత్త భవనాలకు అనుమతి ఇచ్చే సమాయం, మానవీయ పొరపాట్లు తగ్గుతాయని, బిల్డింగ్ డ్రాయింగ్ల సమర్పణలో ఒకే విధమైన ప్రామాణికత పాటించవచ్చని, అన్ని ఫైళ్లను సమాన ప్రాధాన్యతతో ఒకేసారి ఏఐ సాఫ్ట్వేర్ పరిశీలిస్తుందని వెల్లడించారు. పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్తు, నీటి సరఫరా వంటి శాఖలతో సమన్వయం చేసుకుంటూ వేగంగా స్పందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.