Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
Harish Rao | రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు చిన్న పిల్లల ఆటలు ఆడుతున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ రెడ్డి, మంత్రులు గోవా, ఢిల్లీ అని ట్రిప్పులు వేస్తున్నారని ఆరోపించారు.
Harish Rao | రాష్ట్రంలో ఓవైపు ఎల్‌నినో, కరువు పరిస్థితులుంటే ఈ ప్రభుత్వం మాత్రం పట్టిలేని వ్యవహారం నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఉదయం 11 గంటలకల్లా రైతు వేదికల దగ్గరకు రండి.. మీతో ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతారని వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఇది అగ్రికల్చర్ కమిషనర్ ఇచ్చిన నోట్. 11 గంటలకు మీరు రైతు వేదికల వద్ద ఉండండి.. ప్రభుత్వం మీకు చాలా విలువైన సూచనలు రైతులు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు.. ఈ ఎల్‌నినో నేపథ్యంలో రైతులంతా రైతు వేదికల వద్దకు రావాలని ప్రభుత్వం ఇచ్చిన సర్క్యూలర్ అన్నారు.
మా ఎమ్మెల్యేలు.. ఇది మా జిల్లా డీఏవో నాకు పంపిన వాట్సాప్ మేసేజ్. 12గంటలకు ముఖ్చమంత్రి రాష్ట్రంలోని రైతులనుద్దేశించి అన్నీ రైతు వేదికల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతరు.. మీరు రండి అని వ్యవసాయ అధికారులు ఎమ్మెల్యేలకు పంపిన మెసేజ్ ఇది. ఉదయం 9:52 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అని మెసేజ్ పెట్టారు. మళ్లీ 11:15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది రండి అని చెప్పి 11:30కు మొదలవుతుందన్నారు. మళ్లీ కాసేపటికి 1:00 గంటలకు సీఎం రాడు, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి వస్తారని చెప్పారు. అంటే రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతుంటే వీళ్లు చిన్న పిల్లల ఆటలు ఆడుతున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ రెడ్డి, మంత్రులు గోవా, ఢిల్లీ అని ట్రిప్పులు వేస్తున్నారని ఆరోపించారు.
రైతులు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ రెడ్డి, మంత్రులు గోవా, ఢిల్లీ అని ట్రిప్పులు వేస్తున్నారు
ఎల్ నినో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారని, రైతు వేదికల వద్దకు రావాలని ఎమ్మెల్యేలకు, రైతులకు అధికారులు సర్క్యులర్ ఇచ్చారు
ఉదయం 9:52 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అని మెసేజ్ పెట్టారు
మళ్లీ 11:15 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది రండి అని చెప్పి, మళ్లీ కాసేపటికి 1:00 గంటలకు సీఎం రాడు, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి వస్తారని చెప్పారు
అంటే రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతుంటే వీళ్లు చిన్న పిల్లల ఆటలు ఆడుతున్నారు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) October 12, 2026
Read Also :
Kalvala Project | కన్నీటి మడుగులా ‘కల్వల ప్రాజెక్ట్’..!.. మూడేళ్లుగా మరమ్మతులకు పడని అడుగులు
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

