ఖమ్మం, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతుల సెగ తగిలింది. షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సీపీఐ, సీపీఎం, రైతుసంఘాల ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేశారు. కలెక్టరేట్ పక్కనే ఉన్న వీ వెంకటాయపాలెం నుంచి కలెక్టరేట్ వరకు జాతీయ రహదారిపై భారీ ప్రదర్శనతో ధర్నా చేశారు. ఈ సమయంలో కలెక్టరేట్లో సమీక్ష ముగించుకొని బయటకు వస్తున్న మంత్రి తుమ్మల కారును ప్రధాన గేటు వద్ద రైతులు అడ్డగించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌కు వ్యతిరేకంగా ని నాదాలు చేశారు. దీంతో కారు దిగిన తుమ్మ ల వారితో మాట్లాడారు. అయినప్పటికీ వారు నినాదాలు ఆపకపోవడంతో తీవ్ర అసహనానికి గురై రైతులపై చెయ్యెత్తారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 41,78,892 మంది రైతులు 40 బ్యాంకుల ద్వారా 5,782 బ్రాంచిల నుంచి రుణాలు తీ సుకున్నారని తెలిపారు. ప్రభుత్వం రూ.31 వేల కోట్ల నిధులను కేటాయించిందని చెప్పా రు. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, అ మలు చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.12 వేల కోట్లు రైతుల ఖాతాల నుంచి తి రిగి రుణాలుగా పొందారని చెప్పారు. కుటుం బ నిర్ధారణ జరగకనే రుణమాఫీ ఆలస్యమవుతున్నదని, ప్రభుత్వపరంగా ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు. మంగళవారం నుంచి వ్యవసాయ అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారని చెప్పారు. కుటుంబసభ్యుల ఫొటోలను ప్రత్యేకయాప్లో అప్లోడ్ చేస్తారని తద్వారా రుణమాఫీ మొత్తం రైతు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు.
అంతకుముందు ధర్నాలో సీపీఐ, సీపీఎం నాయకులు, రైతుసంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో సగం మంది రైతులకే రుణమాఫీ జరిగిందని, ప్రభుత్వ లెక్కలు అసంబద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 30 శాతం మందికి కూడా రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. ఆగస్టు 30వ తేదీలోపు 2లక్షల రుణమాఫీ జరగాలని లేదంటే రైతులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ధర్నా అనంతరం రైతుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ రెండు పార్టీలు నేతలు, రైతు సంఘాల నేతలు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీలో జరిగిన లోపాల సవరణకు నేటి(బుధ వారం) నుంచి పూర్తిస్థాయిలో గ్రామా ల వారీగా సర్వే నిర్వహించనున్నట్టు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు రుణమాఫీపై మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంక్‌ల నుంచి వచ్చిన వివరాల్లో తప్పులను మండల వ్యవసాయ అధికారులతో వేగవంతంగా సవరించనున్నట్టు చెప్పారు. ఆగస్టు 15నాటికి 22,37,848 లక్షల మంది రైతులకు రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసినట్టు ఆ శాఖ కార్యదర్శి రఘునందనరావు మంత్రికి వివరించారు. కుటుంబ సభ్యుల నిర్ధారణ కాని రైతుల కోసం యాప్ రూపొందించినట్టు చెప్పారు. సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి, సిబ్బంది పాల్గొన్నారు.