హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఉచిత శిక్షణ అందించేందుకు తాము ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ, ఏక్ స్టెఫ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటనలో తెలిపారు. ఈ మూడు సంస్థల ద్వారా 4,51,487 మంది ఆన్లైన్ పాఠాలు వీక్షించారని వెల్లడించారు. ఏక్ స్టెఫ్ ఫౌండేషన్ ద్వారా 11వేల మంది, ఖాన్ అకాడమీ ద్వారా 3.12లక్షలు, ఫిజిక్స్‌వాలా క్లాసులను ఇప్పటి వరకు 1.27లక్షల మంది విద్యార్థులు వీక్షించారని చెప్పారు. ఈ మూడు సంస్థల ద్వారా జేఈఈ, నీట్, ఎప్‌సెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. వీటికి విద్యార్థుల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయడంలేదని వెల్లడించారు. మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ర్టాలు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపారు.