సంగారెడ్డి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు, మెట్రోరైలు నెట్వర్క్ బలోపేతానికి రాబోయే రోజుల్లో ఐఐటీ హైదరాబాద్, ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్, ఐఐటీ హైదరాబాద్‌లోని టీహాన్ మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. టీహాన్-ఐఐటీహెచ్ హబ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్‌రెడ్డి, ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ వికాస్కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.
సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ (టీహాన్) అత్యాధునికి వైమానిక, భూసంబంధమైన టెస్టు బెడ్‌ను నిర్మించింది. ఐఐటీహెచ్ మానవరహిత వాహనాలు, రోబోటిక్స్, ఏఐ ఆధారిత ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ, మానవరహిత డ్రోన్స్, అత్యాధునిక నావిగేషన్ టెక్నాలజీని అభివృద్ధ్ది చేస్తున్నది. ఐఐటీ హైదరాబాద్-టీహాన్ అభివృద్ధి చేసిన అధునాతన టెక్నాలజీని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో పంచుకుని, నెట్వ ర్క్ ఏర్పాటు చేయనున్నది. ఢిల్లీ మెట్రోరైల్ చివరి మైలు కనెక్టివిటీని బలోపేతానికి టీహాన్-ఐఐటీహెచ్ పనిచేయనున్నాయి.