అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
- లేనిపక్షంలో బీజేపీ మీటింగ్‌ల వద్ద నల్లజెండాలతో నిరసన
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి వెల్లడి
హిమాయత్‌నగర్, జూన్ 26: దేశ భద్రతకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా ఉన్న ‘అగ్నిపథ్ స్కీం’ను తక్షణమే రద్దు చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జూలై 2, 3న నగరంలో నిర్వహించే బీజేపీ జాతీయ సమావేశాల వద్ద ప్రజలతో కలిసి నల్ల జెండాలు చేబూని నిరసన ప్రకటిస్తామని తెలిపారు. ఆదివారం నగరంలోని హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైనికుల శక్తి, దేశభక్తిని నిర్యీర్యం చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అగ్నిపథ్ స్కీంపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలని ఆయన ప్రజలకు కోరారు. సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ వసంత్‌రావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సతీశ్‌కుమార్, గ్రేటర్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్,అధికార ప్రతినిధి శ్రీనివాస్, డీబీఎస్ఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇటికాల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Agneepath Scheme
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

