నెన్నెల, నవంబర్ 1 : ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించిన అఘోరి మాతను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి చెందిన అఘోరి మాత అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ నవంబర్ ఒకటో తేదీన సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం చేసుకుంటానని అక్టోబర్ 29న సంచలన ప్రకటన చేశారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్కు బయలుదేరగా, పోలీసులు అడ్డుకొని స్వగ్రామమైన కుశ్నపల్లికి భారీ భద్రత మధ్య తరలించి తల్లిదండ్రులకు అప్పగించారు.
కుశ్నపల్లికి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అఘోరి ఆత్మార్పణ నిర్ణయాన్ని వెనకు తీసుకున్నట్టు భక్తులు చెబుతున్నారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సీఐ అప్జలొద్దిన్ గ్రామంలో పటిష్ట భద్రత కల్పించారు.