మహదేవపూర్ (కాళేశ్వరం), జనవరి 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 9న తనిఖీలు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కాళేశ్వరంలోని హరితహోటల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడి నుంచి మేడిగడ్డ బరాజ్‌కు వెళ్లి ఇంజినీరింగ్ కార్యాలయంలో బరాజ్‌కు సంబంధించిన పలు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.