బయ్యారం, అక్టోబర్ 28 : బోధనా సమయంలో టీచర్ గద్దించడంతో ఓ విద్యార్థినికి నోటి మాట బందైన విషయం మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహబూబాబాద్ జిల్లా బయ్యార ం మండలం వెంకట్రాంపురం జె డ్పీ పాఠశాలలో చోక్లతండాకు చెందిన ఓ విద్యార్థిని ఎనిమిదో తరగతి చదువుతున్నది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండగా మంచిగా చదవాలని ఉపాధ్యాయుడు గట్టిగా మందలించాడు.
కొద్దిసేపటి తర్వా త విద్యార్థిని పలుకరించగా మాట్లాడకుండా ఉండటాన్ని గమనించిన ఉపాధ్యాయులు కుటుంబసభ్యుల కు సమాచారం అందించారు. వా రు వెంటనే వచ్చి బయ్యారంలోని దవాఖానకు తీసుకెళ్లగా అక్కడి వైద్యుడి సూచన మేరకు మహబూబాబాద్‌కు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని మాట్లాడుతున్నట్టు మాచారం.