హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)/మేడ్చల్: డిజిటల్ క్రాప్ సర్వేపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏఈవోలు డిమాండ్ చేశారు. 2,100 మంది ఏఈవోలు నియమితులై ఏడేండ్లు పూర్తయిన నేపథ్యలో ఆదివారం శామీర్‌పేట్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏడేండ్లలో విధి నిర్వహణలో ఎదురైన అనుభవాలను చర్చించుకున్నారు. అనంతరం అడ్హాక్ కమిటీని ఏర్పాటుచేసుకున్నారు. చైర్మన్‌గా రాజ్‌కుమార్ బాదావత్, కన్వీనర్లుగా పంజాల రాజు, కల్లెపల్లి పరశురాం, బందెల సుమన్, కల్యాణితో 32 జిల్లాల కో కన్వీనర్లను ఎన్నుకున్నారు. నూత న కమిటీ సభ్యులు మాట్లాడుతూ విధినిర్వహణలో ఇప్పటికే అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అష్టకష్టాలు పడుతూ 49 రకాల సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ తరుణంలో తమను ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయాలనడం సరికాదన్నారు.