చెన్నూర్, ఆగస్టు 9: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నీటిపారుదల శాఖ ఏఈ జాడి చేతన్ రూ.5 వేల లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కారు. చెన్నూర్ మండలం కిష్టంపేట బొమ్మ చంద్రశేఖర్రెడ్డి 2016-17లో మిషన్ కాకతీయలో దుగ్నెపల్లి సాలేకుంట పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈఎండీ, ఎఫ్ఎస్డీ బిల్లుల చెల్లింపుల కోసం ఎంబీ సమర్పించేందుకు ఏఈ చేతన్ రూ.5 వేలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. చెన్నూర్ కార్యాలయంలో చంద్రశేఖర్రెడ్డి నుంచి ఏఈ రూ.5 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పట్టుకుని కోర్టులో హారజరుపర్చారు.