హైదరాబాద్/మహబూబ్‌నగర్/జడ్చర్ల టౌన్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ మంగళవారం హైకోర్టుతోతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిషరించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు న్యాయవాదులు కేసుల విచారణకు హాజరు కాలేదు. దీంతో వారి కేసులపై న్యాయమూర్తులు ఎలాంటి వ్యతిరేక ఉత్తర్వులు ఇవ్వకుండా వాయిదా వేశారు. అంతకుముందు హైకోర్టు 6వ గేటు నుంచి 4వ గేటు వరకు లాయర్లు ర్యాలీ నిర్వహించి, బైఠాయించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ ఇజ్రాయిల్ హత్యను ఖండించారు. అలాగే మహ బూబ్‌నగర్, జడ్చర్లలో లాయర్లు విధులను బహిష్కరించారు. మహబూబ్‌నగర్ కోర్టు ప్రాంగణం నుంచి తెలంగాణ చౌ రస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
సమస్తే నెట్వర్క్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వీవోఏలు (గ్రామ సంఘ సహాయకులు) ఆందోళన బాటపట్టారు. మంగళవారం రాష్ట్ర నలుమూలల నుం చి తరలివచ్చిన వందలాదిమంది మాసబ్‌ట్యాంక్‌లోని సెర్ప్ ఆఫీసు వద్ద మెరుపు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతినెలా రూ. 20 వేల చొప్పున వేతనం ఇవ్వాల ని, స్త్రీనిధి ఇన్సెంటివ్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, సెర్ప్ కా ర్యాలయం వద్ద మెరుపు సమ్మెకు దిగిన వీవోఏలను పోలీసులు అడ్డుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు అక్కడ నుంచి వారిని వ్యాన్లల్లో తరలించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యా ప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌కు పిలుపునివ్వగా జీపీ కార్మికులు, వీవోఏలు హైదరాబాద్‌కు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు.