Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈనెల ఏడవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల రీత్యా ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష కేంద్రం, సమయంలో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.