హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంఎడ్, ఎంపీఎడ్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తొలి విడుత ప్రవేశాల షెడ్యూల్‌ను సీపీ గెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం విడుదల చేశారు. ఆదివారం నుంచే కౌన్సెలింగ్ ప్రారంభంకానుండగా, 8వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగియనుంది.
ఈ నెల 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండగా, 9 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 11న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్‌కు అవకాశం కల్పించగా, 15న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారంతా ఈ నెల 18 వరకు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.