ఆదిలాబాద్: ఆదిలాబాద్ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. ఎటుచూసినా గుట్టలు, పచ్చని చెట్లు, జలపాతాలు, దట్టమైన అడవులు, పక్షుల కిలాకిలా రావాలతో భిన్న వాతావరణ పరిస్థితులకు నిలయం. అందులోనూ శీతాకాలంలో కశ్మీర్‌ను తలపించే అందాలు ఆదిలాబాద్ సొంతం. ఈ అందాలకు ఇప్పుడు మంచు తోడయింది. తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచు చూపరులకు కనువిందు చేస్తున్నది.
ఆదిలాబాద్ పట్టణాన్ని బుధవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఉదయం 7 గంటలు దాటినప్పట్టికీ మంచు దట్టంగా కప్పుకున్నది. దీంతోపాటు జిల్లావ్యాప్తంగా మంచుకురుస్తున్నది.
అయితే మంచు విపరీతంగా కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొగ మంచువల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. అడుగు దూరంలోని మనిషి కూడా కనిపించని రీతిలో మంచు కమ్ముకున్నది.