ఆదిబట్ల, డిసెంబర్ 14: రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన కొడుదుల నవీన్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఐదు రోజులుగా తప్పించుకు తిరుగుతూ మంగళవారం సాయంత్రం గోవాలో ఆదిబట్ల పోలీసులకు పట్టుబడ్డ విషయం తెల్సిందే. బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకొచ్చిన పోలీసులు అతడి నుంచి ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. మరో ఐదుగురు నిందితులు బండ చంద్రశేఖర్‌రెడ్డి, ఎర్రమల ్లప్రకాశ్కుమార్, అల్లబోయిన మహేశ్, పైసా ప్రవీణ్, యశ్వంత్‌లను కూడా రిమాండ్ చేశారు.
కస్టడీ పిటిషన్ విచారణ నేటికి వాయిదా
ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించేందుకు ఐదుగురు నిందితులను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఆదిబట్ల పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఎ3 నాగారం భానుప్రకాశ్ అలియాస్ భాను, ఎ4 రాథోడ్ సాయినాథ్, ఎ8 గానోజ్ ప్రసాద్, ఎ9 కోతి హరి, ఎ30 బోని విశ్వేశ్వర్రావు అలియాస్ సిద్దు కస్టడీకోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే కస్టడీ విచారణ గురువారానికి వాయిదా పడింది.