జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేట గ్రామపంచాయతీ పరిధిలో గల గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన 30 మంది గ్రామస్తులు మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. పనిచేసే వారికి పార్టీలో సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగం మహేష్, వార్డ్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.