హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీచర్లు తమ అభిరుచిని బట్టి నైపుణ్యం పెంచుకొనే దిశలో యాడ్ ఆన్ కోర్సులను ప్రవేశపెట్టాలని నేషనల్ కౌ న్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన ఎన్సీటీఈ 59వ జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు ఒక కమిటీని నియమించనున్నది. ఈ కమిటీ సూచనల మేరకు కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తారని ఎన్సీటీఈ వర్గాలు వెల్లడించాయి.