Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
ఎల్-నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తనున్న తీవ్ర నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీవాసులు ఆదర్శంగా నిలిచారు.
జహీరాబాద్, నవంబర్ 1 : ఎల్-నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తనున్న తీవ్ర నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీవాసులు ఆదర్శంగా నిలిచారు. నీటి వృథా నివారణే లక్ష్యంగా ఆదివారం కాలనీలో స్వచ్ఛందంగా ఇంటింటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండే కాలనీవాసులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఎల్-నినో వల్ల వచ్చే ఏడాది వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని వివరించారు. నీటిని పొదుపుగా వాడటం, పైపుల లీకేజీలను అరికట్టడం, ఇంకుడు గుంతలు తవ్వడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేసుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ మమ్మద్ యూనివర్స్ , వైస్ చైర్మన్ శిరీష రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఆదర్శనగర్ వాసులు చేపట్టిన ఈ కార్యక్రమం పట్టణంలోని అన్ని కాలనీలకు ఆదర్శమని, మున్సిపాలిటీ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతి ఇంట్లో నీటి పొదుపు పాటిస్తామని ఈ సందర్భంగా కాలనీవాసులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన వెంకట్ రెడ్డి, సూర్ రెడ్డి, సుభాష్ రావు, యోగా గురువు నారాయణరెడ్డి, దత్తాత్రేయ రెడ్డి, శంకరప్ప పాటిల్, పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు అరుణ్ కుమార్, జహంగీర్, నర్సింలు, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, రాములు, హన్మ గౌడ్, గోపాల్, మల్లికార్జున్, ప్రభాకర్, నవీన, శివరాజ్, శంకర్, లింగన్నతో పాటు మహిళా ప్రతినిధులు, యోగా సమితి సభ్యులు, వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

