కంఠేశ్వర్, మే 21: నిజామాబాద్ ఏడీఏ ప్రదీప్కుమార్ను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్పల్లి మండల వ్యవసాయాధికారిగా పనిచేసిన ప్రవీణ్ చనిపోయి సంవత్సరం అవుతున్నా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంలో జాప్యం జరుగుతున్నది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఏవో ఫొటోతో ఈ నెల 15న కలెక్టరేట్లోని ఏడీఏ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్ లో ‘చనిపోయి ఏడాది అవుతున్నా బెనిఫిట్స్ ఇవ్వరా..?’ అనే శీర్షికతో వార్త ప్రచురించింది. దీంతో జాయి ంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సింగారెడ్డి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శివాజీపాటిల్తో కమిషన్ ఏర్పాటుచేసి, విచారణ చేపట్టారు. ఈ క్రమం లో ఏడీఏ ప్రదీప్కుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బాధిత కుటుంబ సభ్యులు నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపారు.