నవాబుపేట, నవంబర్ 25 : వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి సోమవారం సినీ నటుడు ఆలీ వచ్చి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. మండల పరిధిలోని ఎక్మామిడి రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్లు 340, 341, 344, 345లో 5.22 ఎకరాల భూమి విస్తీర్ణానికి సంబంధించి భూమి కోసం తహసీల్దార్ జయరాం నుంచి అనుమతులు పొందారు.