Telangana | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మద్యం షాపుల నుంచి బీర్లను పక్కదారి పట్టించినా, ఎవరైనా ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ ఆదేశించారు. ఆబారీ భవన్లో శుక్రవారం అన్ని జిల్లాల డీసీలు, ఏసీలతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. డీసీలు, ఏసీ లు అశించిన స్థాయిలో విధులు నిర్వహించ డం లేదని అసహనం వ్యక్తం చేశారు.
కొందరు స్థానికంగా ఉండటం లేదని, ఇక నుంచి అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తెలంగాణలో బీర్ల కొరత ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై ఎక్సైజ్ అధికారులు స్పందించాలని సూచించారు. అడిషనల్ కమిషనర్ అజయ్, బ్రూవరీస్ కార్పొరేషన్ జీఎం అబ్రహం ఉన్నారు. తెలంగాణలో తాము 2014 నుంచి అత్యంత నాణ్యతతో బీర్లను ఉత్పత్తి చేస్తున్నామని లీ లాసన్స్ బ్రూవరీ తెలిపింది. కొన్ని దినపత్రికల్లో వస్తు న్న ఆరోపణలను ఖండించింది.