హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ‘ఆపరేషన్ సిందూర్’పై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా కఠినచర్యలు తప్పవని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఈ మేరకు తమ ఎక్స్ అధికారిక హ్యాండిల్లో పోస్టు పెట్టింది. ‘సోషల్ మీడియాలో చాలామంది ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుడు వార్తల ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
దీంతో ఎంతోమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. దుష్ప్రచారం నిరోధానికి మేము సోషల్ మీడియాను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించింది. ఇలాంటి పోస్టులు ఎవరికైనా కనిపిస్తే వెంటనే 8712672222 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సీఎస్బీ కోరింది.