హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పేరిట ఫేక్ వీడియోలు తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు తప్పు చేయకపోయినా కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. అల్లు అర్జున్ వ్యవహారంలో బీఆర్ఎస్ పేరుతో ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.