పీర్జాదిగూడ, డిసెంబర్ 23: పుష్ప-2 సినిమాలో పోలీసులను కించపరిచేలా సన్నివేశాలు తీశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో పోలీస్ అధికారి స్విమ్మిగ్‌పూల్‌లో ఉండగా హీరో మూత్రం పోసే సన్నివేశం పోలీసులను అవమానించినట్టుందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు సీఐ చెప్పారు.