సుల్తాన్‌బజార్, జూలై 8: ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్లపాటు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో అర్చక, ఉద్యోగులు తీవ్రంగా నష్టపో యారని దేవాదాయశాఖ అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు పేర్కొన్నారు. శుక్రవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని రవీంద్రాచార్యులు మర్యాద పూర్వకంగా కలుసుకొని రాష్ట్రంలో అర్చక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వరాష్ట్రంలోనే 577 జీవో ప్రకారం 5,625 మంది అర్చక, ఉద్యోగులకు మంత్రి నేతృత్వంలో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి క్రమబద్ధీకరించడం గొప్ప విషయమన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అర్చక, ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జీత భత్యాలు తీసుకోవడం చరిత్ర అని జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా ఉపనయనాలు, వివాహాలు, గృహ నిర్మాణాలు, వైద్య, విద్య వంటి సదుపాయాలను పొందవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ బోర్డు సభ్యులుగా నియమితులైన దత్తాపురం నారాయణస్వామి, చిలకమర్రి శ్రావణ్‌కుమార్ ఆచార్యులు, కాండూరి కృష్ణమాచార్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అర్చక అధ్యక్షుడు చింతపట్ట బద్రీనాథ్, సంఘం ప్రధాన కార్యదర్శి యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్ర చంద్రశేఖర్‌శర్మ, ఉపాధ్యక్షుడు దిలీప్ జోషి, బండారి జగదీశ్, జగపతిప్రసాద్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.