జగిత్యాల, అక్టోబర్ 25: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డి హత్య కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ అశోక్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మారు గంగారెడ్డి(58) ఈ నెల 22న గ్రామంలో హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బత్తిని సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్లతో రూ.లక్షన్నరలోపు రుణం ఉన్న రైతులకు మాఫీ చేసిందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. త్వరలోనే రూ.2 లక్షల రుణం ఉన్న వారికి మాఫీ వర్తింపజేస్తామని ప్రకటించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు.