ముంబై, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వైద్యురాలిపై లైంగికదాడి చేయడంతోపాటు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న తెలంగాణ యువకుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన వైద్యురాలికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమర్నాథ్తో ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది.
ఆమెను ఓ రోజు హోటల్‌కు ఆహ్వానించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఫొటోలు, వీడియోలు రికార్డు చేశాడు. వాటిని ఆమె భర్తకు పంపుతానని బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె నుంచి బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి అరెస్ట్ చేశారు.