హైదరాబాద్, అక్టోబర్9 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 ప్రకారం కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ మధ్య పునఃపంపిణీని పర్యవేక్షించేలా బ్రిజేష్కుమార్ట్రిబ్యునల్కు కేంద్రం ఇటీవల జారీచేసిన నూతన టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) గెజిట్‌పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.
టీవోఆర్‌పై భవిష్యత్‌లో ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ముందుగా తెలంగాణకు సమాచారం ఇవ్వడంతోపాటు వాదనలు విన్న తరువాతనే ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించే అవకాశముంటుంది. ఇప్పటికే కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేస్తామని ఇటీవల ఏపీ ప్రకటించిన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన రాష్ట్ర సర్కారు కేవియట్ దాఖలు చేసింది.