అవినీతి నిరోధక శాఖ మరో అవినీతి అధికారిని పట్టుకున్నది. విద్యుత్తు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అక్రమ సంపాదనలో రూ.వందల కోట్లకు పడగలెత్తిన ఇబ్రహీంబాగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) ఇరుగు అంబేద్కర్‌ను అరెస్టు చేసింది. మంగళవారం ఉదయం అతని ఇండ్లు, కుటుంబసభ్యులు, స్నేహితులు, బినామీలకు చెందిన 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి.. భారీగా నగదు, నగలు, స్థిర, చరాస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూ.2.18 కోట్ల లిక్విడ్ క్యాష్ పట్టుబడటం గమనార్హం!
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అక్రమ సంపాదనలో వందల కోట్లకు పడగలెత్తిన ఇబ్రహీంబాగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) ఇరు గు అంబేద్కర్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. అతని ఇండ్లు, కుటుంబసభ్యులు, స్నేహితులు, బినామీలకు చెందిన 11 ప్రాంతా ల్లో ఏకకాలంలో మంగళవారం ఉదయం సోదాలు చేపట్టి.. భారీగా నగదు, నగలు, స్థిర, చరాస్తుల పత్రాలను ఏసీబీ స్వాధీ నం చేసుకున్నది. ఈ సోదాల్లో శేరిలింగంపల్లిలో ఒక ప్లాట్, గచ్చిబౌలిలోని జీ+5 బిల్డింగ్, సూర్యాపేట జిల్లాలోని అమ్తార్ కెమికల్స్‌కు చెందిన 10 ఎకరాల భూమి, హైదరాబాద్‌లోని 6 రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూమి, రెండు కార్లు, భారీగా బంగారు, వెండి ఆభరణా లు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు చేసుకున్నారు. అంబేద్కర్‌కు చెందిన ఓ బినామీ ఇంట్లో ఏసీబీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూ.2.18 కోట్ల లిక్వి డ్ క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్ సహా.. హైదరాబాద్ నగరంలో ని గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. దీంతోపాటు బ్యాంకు బ్యాలెన్స్ రూ.78 లక్షలు, షేర్లలో మరో రూ.36 లక్షల పెట్టుబడులు ఉన్న ట్టు గుర్తించి ంది. కారులో మరో రూ.5.5 లక్షల నగదు దొరికిందని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. సోదా లు చేపట్టిన చోట్ల భారీగా అక్రమాస్తుల ఆస్తుల పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ కేసులో విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు.
విద్యుత్తు సంబంధిత సమస్యలతో వచ్చే ఎంతోమందిని ఏడీఈ అంబేద్కర్ లంచాల కోసం తీవ్రంగా వేధించినట్టు చాలామంది బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ రహస్య విచారణలో ఇప్పటికే రూ. వంద ల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు తెలుసుకొని.. మంగళవారం అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గతం నుంచి అంబేద్కర్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదు లు రాగా, విద్యుత్తు శాఖ గత సంవత్సరం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కాంగ్రె స్ ప్రభుత్వంలోని ఓ కీలక నేతను అప్రో చ్ అయ్యాడు. ఆయన సహకారంతో సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకొని.. తనకు బాగా కలిసొచ్చిన ఇబ్రహీంబాగ్‌లో మళ్లీ అదేచోట పోస్టింగ్‌లో కొనసాగాడు. అయి తే, అతని అక్రమాలకు ఆ కాంగ్రెస్ నేత అండదండలు దండిగా ఉండటంతో.. తన దగ్గరకు వచ్చే వారిని డబ్బుల కోసం జలగలా పట్టి పీడించేవాడని తెలిసింది.