హైదరాబాద్: మాదాపూర్లోని గ్రీన్కో కార్యాలయంలో ఏసీబీ (ACB) సోదాలు నిర్వహిస్తున్నది. మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 41 కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం, గన్నవరంలోని ఏస్ నెక్ట్స్ జెన్ కార్యాలయాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.