బంజారాహిల్స్, జూన్ 16: లంబాడీ సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు, అధికారులపై ఏసీబీ దాడులను నిరసిస్తూ గిరిజన విద్యార్థి సంఘం నేతలు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. గిరిజన విద్యార్థి సంఘంతోపాటు ఇతర సంఘాలకు చెందిన నాయకులు మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ కార్యాలయం వైపునకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అ డ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.