నవీపేట, డిసెంబర్ 2:నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లి కేజీబీవీలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. ఉదయం 6గంటలకు మొదలైన సోదాలు 12 గంటలపాటు కొనసాగాయి. పీఎంశ్రీ నిధుల వినియోగంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేసినట్టు తెలిసింది. అక్రమాలు తేలితే చర్యలుంటాయని ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఉడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇండ్లు, హోటళ్లల్లోనూ మంగళవారం ఉదయం తనిఖీలు చేశారు. లక్డీకాపూల్, రెడ్హిల్స్తో పాటు పలుచోట్ల ఈ సోదాలు జరిగాయి. యజమాని అలీఖాన్ లావాదేవీల వివరాలపై ఆరాతీశారు. భారీగా పన్ను ఎగవేత వేసినట్టు తనిఖీల్లో గుర్తించి కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెసింది. ఇటీవల షాగౌస్, పిస్తాహౌస్, మెహఫిల్ రెస్టారెంట్ల యజమానుల ఇండ్లల్లో ఐటీ సోదాలు జరిగాయి.