హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన వెంటనే.. ఏపీ, తెలంగాణలో మోహరించిన ఏసీబీ అధికారులు మంగళవారం గ్రీన్ కో, అనుబంధ సంస్థల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో, ఏపీలో కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రీన్ కో ఎనర్జీ కార్యాలయంలో తనీఖీలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి దాదాపు 12 మంది ఏసీబీ అధికారులు విసృ్తతంగా తనిఖీలు నిర్వహించారు. రాత్రి వరకూ సోదాలు కొనసాగగా పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో గ్రీన్ కో సంస్థ కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ 4వ అంతస్తులో అధికారులు సోదాలు చేపట్టారు. ‘ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్’లో తనిఖీలు చేసి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.