హైదరాబాద్ : ఖమ్మం(Khammam) జిల్లాలో రెండో రోజు ఏసీబీ అధికారుల సోదాలు(ACB raids) నిర్వహించారు. సుమారు 20 గంటల వాటు సోదాలు చేపట్టి 20 మంది ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు పేపర్లు, ఆర్సీలు, లైసెన్స్, రూ. 78 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రవాణా శాఖ అధికారుల ఇళ్లలో సైతం సోదాలు నిర్వహించారు.
కాగా, జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిన్న మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. రవాణా శాఖలో జరుగుతున్న అక్రమ వసూళ్లు, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ జారీ వంటి పనుల కోసం మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో ఖమ్మం ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు.