చర్ల, మే 23 : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ కథనం ప్రకారం.. చర్ల మండలం దండుపేటకు చెందిన రైతు కర్ల రాంబాబు మూడెకరాల రెండు గుంటల భూమిని కొనుగోలు చేశారు.
దీన్ని తన భార్య రాజమ్మ పేరిట పట్టా చేయించడానికి గతంలో ఇన్‌చార్జ్జి తహసీల్దార్‌గా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ భరణిబాబును కలిశారు. ఆ భూమిని పట్టా చేసేందుకు భరణిబాబు రూ.50 వేలు డిమాండ్ చేయగా రూ.20 వేలకు ఒప్పందం కుదిరింది. ఆ మేరకు రాంబాబు నుంచి డిప్యూటీ తహసీల్దార్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.