హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతున్నది. తాజాగా ఫార్ము లా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) కంపెనీ సీఈ వో జెఫ్ డాడ్స్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. వచ్చేవారం విచారణకు రావాలని కోరింది. ఏసీబీ నోటీసులపై జెఫ్ డాడ్స్ స్పందించారు. విచారణకు వచ్చేందుకు తనకు నాలుగు వారాల సమయం కావాలని కోరారు. దీం తో ఏసీబీ అధికారులు అంగీకరించారు.
‘ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుచేయాలి’
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : టీచర్ల ఏకీకతృత సర్వీస్ రూల్స్ అమలుచేసి పదోన్నతులు కల్పించాలని పీఆర్టీయూ టీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రతినిధులు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.