హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ అభ్యర్థులను కించపర్చేలా ఏసీబీ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం డీఎస్ఈ ముట్టడిలో పాల్గొన్న డీఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి పేట్లబురుజు నుం చి ఓయూకు తరలివెళ్లారు.
ఓయూలో మంగళవారం ఉదయం భారీ పోలీసు బలగాలు మో హరించి వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భం గా క్యాంపస్‌లోకి బలగాలతో నడుచుకుంటూ వస్తున్న స్థానిక ఏసీపీ జగన్ మీడియాను చూసి ‘క్యారీ ఆన్.. మీ పని మీరు చేసుకోండి.. మీడియా చేస్తున్న ధర్నా ఇది’ అని వ్యాఖ్యానించారు. ఏసీపీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.