మహబూబాబాద్ : భూ భారతి రికార్డుల్లో పేరును నమోదు చేయడానికి లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామ శివారులోని పడమటి తండా గ్రామపంచాయతీకి చెందిన భూక్యా బాలు అనే రైతు తన తండ్రి మరణించారు.
భూక్యా స్వామి మృతి చెందడంతో తండ్రిపేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద భూ భారతి రికార్డుల్లో నమోదు చేయించుకోవడానికి తహసీల్దార్ వీరగంటి మహేందర్‌ను కలిశాడు. రూ.25వేల లంచంను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం 15 వేల రూపాయలు ఇస్తూ శుక్రవారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.