హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యలో అకడమిక్ అంశాలపై దృష్టిపెట్టేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ‘అకడమిక్ గైడెన్స్ సెల్’ పేరిట నెలకొల్పనున్నారు. ప్రస్తుతం ఫైల్ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నది. పాఠశాల విద్యలో అకడమిక్ అంశాలపై దృష్టిపెట్టేందుకు ఎస్సీఈఆర్టీ, డిగ్రీ కాలేజీల వ్యవహారాలు చూసే కాలేజీయేట్ కమిషనరేట్‌లో అకడమిక్ గైడెన్స్సెల్స్ ఉన్నాయి. అయితే ఇంటర్ విద్యలో ఇలాంటి విభాగం లేదు. సర్కారు జూనియర్ కాలేజీల పర్యవేక్షణకు ఇంటర్ విద్య కమిషనరేట్, ప్రైవేట్ కాలేజీలు, పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డులు వేర్వేరుగా ఉన్నాయి. దీంతో అకడమిక్ అంశాలపై దృష్టిపెట్టేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఇంటర్ విద్యలోనూ అకడమిక్ గైడెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఆయా ఫైల్‌ను ఇంటర్ విద్య డైరెక్టర్ శృతి ఓజాకు పంపించారు. ప్రిన్సిపాల్ లేదా లెక్చరర్లు, సబ్జెక్టు నిపుణులను ఈ సెల్‌కు ఇన్చార్జిగా నియమించే అవకాశాలున్నాయి. ఎస్సీఈఆర్టీ తరహాలో విద్యాసంబంధ అంశాలపై దృష్టిపెడతారు.
అకడమిక్ గైడెన్స్ సెల్ విధులు