హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అబార్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడం తీవ్ర కలకలం రేపుతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 1,578 అబార్షన్లు (మెడికల్లీ టెర్మినేటెడ్ ప్రెగ్నెన్సీలు) నమోదు కాగా..
గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య ఏకంగా 10 రెట్లు అధికమై 16,059కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్లో వెల్లడించారు. ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న ఏపీలో సైతం అబార్షన్ల సంఖ్య 2,282 నుంచి 10,676కు పెరిగినట్టు తెలిపారు.