కొత్తకొండ గుట్టపై ఆదిమానవుడి ఆనవాళ్లు!
ఇళ్లారా గుండు గుహలో రాతి పనిముట్లు
గుట్టపై టెర్రకోట కేక్స్
పురావస్తు చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి వెల్లడి
భీమదేవరపల్లి, మార్చి 29: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గుట్టపై ఇళ్లారా గుండు గుహలో ఆదిమానవులు జీవించిన ఆనవాళ్లు ఉన్నట్టు పురావస్తు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కొద్ది రోజులుగా గుండు గుహపై కొల్లేటి శ్రీనివాస్, సిద్దమల్ల రాజేందర్‌తో కలిసి ఆయన పరిశోధిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విశేషాలను సోమవారం రత్నాకర్‌రెడ్డి వెల్లడించారు. ఇక్కడ టెర్రకోట కేక్స్ బయటపడడంతో హరప్పా సంస్కృతి కొత్తకొండ వరకు వ్యాప్తి చెందిందని నిరూపితమైందని తెలిపారు. ఈ గుట్ట కేంద్రంగా సుమారు 10 వేల ఏళ్ల క్రితం నుంచే శిలాయుగపు నాటి ఆదిమానవులు జీవించారని చెప్పారు. ఇళ్లారా గుండు అంటే విశాలమైన గుండు అని అర్థమని వివరించారు.
గుహలో రాతి పనిముట్లు
100 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో ఉన్న విశాలమైన గుహలో పడమర వైపు ప్రధాన ప్రవేశద్వారం ఉండగా నైరుతి మార్గంలో ఉన్న ద్వారాన్ని మూసివేశారు. గుహ లోపలి నుంచి ఉత్తరం వైపు పైకి వెళ్లే తోవ ఉన్నది. గుహ ముందు భాగంలో సూక్ష్మ రాతి పనిముట్లు, నవీన శిలాయుగం నాటి రాతి గొడ్డలి, పదునైన బలపం రాయి పనిముట్లు లభించాయి. నలు పు, ఎరుపు, బూడిద రంగు మృణ్మయ పాత్రల ముక్కలు, ధాన్యం నిల్వ చేసే గాబుల అంచు లు కనిపించాయి. సమీప రైతులు ఎన్నో ఏళ్లు గా ఇళ్లారా గుండు గుహను పశువుల కొట్టంగా ఉపయోగించడంతో ఆధారాలు కనుమరుగైనట్టు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. ఇళ్లారా గుండును అభివృద్ధి చేస్తే సందర్శనీయ ప్రాంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!



