నిర్మల్ చైన్గేట్, డిసెంబర్ 3 : నిర్మల్ పట్టణంలో కొంతమంది పింఛన్లు ఇప్పిస్తామంటూ దివ్యాంగుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. అక్కడికి వచ్చిన ఓ సంఘం నాయకుడిని పోశవ్వ అనే బాధితురాలు చొక్కాపట్టుకుని నిలదీసింది.
పింఛన్ ఇప్పిస్తానని తన వద్ద రూ. 8 వేలు తీసుకొని మోసం చేశాడని ఆరోపించింది. దివ్యాంగ పింఛన్ల పేరుతో మోసం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారికే పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దివ్యాంగులు, ఆ సంఘం నాయకులు కోరుతున్నారు.