హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : మెడికల్, జేఈఈ, ఇంజినీరింగ్ వంటి పోటీ పరీక్షలకు మెరుగ్గా సన్నద్ధమయ్యేలా ఆకాశ్ ఎడ్యుకేషన్ సంస్థ ‘ఆకాశ్ డిజిటల్ ప్లాట్‌ఫాం’ను ప్రారంభించిందని, దీంతో టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామిగా నిలిచిందని ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ మెహ్రోత్ర వెల్లడించారు. ఆకాశ్ 2.0 వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ప్రత్యేకమైన డిజిటల్ ఆఫర్‌ను తీసుకువచ్చినట్టు తెలిపారు.
అన్ని ఆకాశ్ మెటీరియల్స్ ఒకే వేదికపై డిజిటల్ స్పేస్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నీట్, జేఈఈ, ఒలింపియాడ్ కోసం కోచింగ్‌ను అందించే ఆన్లైన్ లెర్నింగ్, ఆల్-పవర్డ్ ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫాం.. ఆకాశ్ అని కొనియాడారు. దేశంలో ఎక్కడి నుంచైనా విద్యార్థులు వారి ఇండ్ల నుంచే కోచింగ్‌ను పొందేలా ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్స్, నిపుణుల మార్గదర్శకత్వం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆకాశ్ డిజిటల్ 2.0 బీటా వెర్షన్‌ను ఏడాది క్రితం ప్రారంభించామని.. అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకుని, నీట్, జేఈఈలో ప్రతిభ కనబరిచారని వెల్లడించారు.